తెలంగాణ రైతులకు బిగ్ షాక్…రుణ మాఫీపై మరో మెలిక పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. పంట రుణాల మాఫీపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించిన వ్యవసాయ శాఖ.. ఆడిట్ పూర్తైన తర్వాతే రుణమాఫీ నిధులు జమ కానున్నట్లు సమాధానం ఇస్తున్నారు అధికారులు. దీని కోసం 16 వేల మంది రైతుల రుణ ఖాతాలను పరిగణనలోకి తీసుకోనుందట.
రుణమాఫీలో దాదాపు లక్షకు పైగా ఖాతాల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని సమాచారం. మరోవైపు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేనివారి గురించి త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని నిర్ణయించింది. వీటిపై విచారణ జరిపిన తర్వాతే రుణమాఫీ నిధులు రైతుల ఖాతల్లో జమ చేయనుంది. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇప్పటి వరకు 30 శాతం మంది రైతులకు కూడా రుణమాపీ కాలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు.