మాదాపూర్ లో కార్ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు..!

-

మాదాపూర్ లో కార్ల దొంగలను అరెస్టు చేసారు పోలీసులు. హైదరాబాదులో కార్లు దొంగతనం చేసి బాంబేలో విక్రయిస్తుంది ముఠా. లగ్జరీ కార్లను టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్న ముఠా.. బాంబేలో ఉన్న సేమ్ మోడల్ కార్ ని హైదరాబాదులో దొంగిలిస్తుంది ముఠా. నెంబర్లను మార్చి ముంబై మార్కెట్లో అమ్ముతుంది ముఠా. కొన్ని సందర్భాల్లో కార్లు రెంటుకు తీసుకొని దొంగలించారు అని ఓనర్లకు చెప్తుంది ముఠా.

ఈ కేసుపై మాదాపూర్ డీసీపీ వినీత్ వివరణ ఇస్తూ.. నవంబర్ 10న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చింది. సీపీ ఆదేశాలతో టీమ్స్ దర్యాప్తు చేశారు. నలుగురు నిందితులు ఉష, మలేష్, సాగర్ పాటిల్, అనిల్ కుమార్ గా గుర్తించాము. జూపూడి ఉష కార్ రెంట్ తీసుకుని సాగర్, అనిల్ కు అప్పచెప్తుంది. గంటలు, రోజులు లెక్కన డబ్బులు కట్టి కార్లు రెంట్ కి తీసుకుంటారు. తర్వాత ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేయడం, రెస్పాన్డ్ అవ్వకుండా ఉంటారు ముట్ట సభ్యులు. కొన్ని సందర్భాల్లో కారు దొంగలించబడింది అని ఓనర్ కు మాయ మాటలు చెప్తారు. కారు రెంట్ తీసుకున్న తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర లో తిప్పేవారు. అయితే ఈ ముఠా నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news