విద్యుత్ పవర్ ప్లాంట్ గురించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్లాంట్ లో 10 వేల కోట్లు అంచనా పెంచడం వెనక మింగింది ఎవరో తేల్చాలి. కిషన్ రెడ్డి..జగదీష్ రెడ్డి చుట్టాలు అయ్యారు. డిల్లీకి బావ బమ్మర్డులు వెళ్లి చీకట్లో కాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చుట్టాలు అయ్యారు.
ఎన్టీపీసీ కి అనుమతి ఇచ్చిందే మేము అని, ఎన్టీపీసీ ఉత్పత్తి చేసే పవర్ కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినము. ఉత్పత్తి అవ్వడానికి ఇంకా రెండేళ్లు పడుతుంది. ఇవాళ 8 రూపాయలు యూనిట్ లెక్క కొంటే నష్టం ఎన్టీపీసీ పనులు ఎక్కడ ఆగలేదు. మనం కొనకపోతే వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. 9 రూపాయలు యూనిట్ చొప్పున మనం కొనాల్సి వస్తుంది. రూ.29కోట్ల చిల్లర కొన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి వీళ్ల బంధువులకు కాంట్రాక్టు ఇచ్చారు. పది సంవత్సరాల పాలనలో సోలార్ పవర్ 1 మెగావాట్ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.