ఆరోగ్య శ్రీ రద్దు కాబోతుందా? టీడీపీ ఎంపీ సంచలనం !

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేవపెట్టిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పథకం కొనసాగుతుందా..? లేదా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. తాజాగా కేంద్ర సహాయ మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయుష్మాన్ భారత్ అనేది అందరూ వినాల్సింది తెలుసుకోవాల్సింది. ప్రతీ వ్యక్తికి కూడా రూ.5లక్షలు ఆసుపత్రికి పెడితే.. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ ఇస్తారు. ఈ ఆయుస్మాన్ కార్డులు ప్రతీ ఒక్కరికీ చేరాలి. మూడు లక్షల కుటుంబాలు ఇప్పటికే చేసుకున్నాయి. మిగతా వారు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. అన్ని జిల్లాల ప్రజలు త్వరితగతిన చేసుకోవాలని సూచించారు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ పథకాన్ని ఆరోగ్య శ్రీ పథకం మాదిరిగా వాడుకోవచ్చని తెలిపారు. అయితే ఆరోగ్య శ్రీ లాగా వాడుకోవచ్చు అంటే ఏపీలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎత్తేస్తున్నారా..? అనుమానాలు కలుగుతున్నట్టు సందేహాలు వ్యక్తం అవ్వడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news