కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే లక్ష యాభై వేల కోట్లతో అభివృద్ది చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. కేంద్ర మంత్రిగా హైదరాబాద్ కి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నుంచి రూ.లక్షన్నర కోట్లు ఇప్పిస్తే.. పది లక్షల మందితో సన్మానిస్తానని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీ నది సుందరీకరణకు కలిపి రూ.70వేల కోట్లు కావాలని, వాటి కోసం కిషన్ రెడ్డి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏడ్చే వాళ్ల గురించి తమకు బాధలేదని అభివృద్ధితో ముందుకు సాగుతామని స్పష్టం చేసారు. 

ఫ్యూచర్ సిటీ కోసం ఇంకో 15 వేల ఎకరాలు భూమి కావాలి.. దానికి రైతులు సహకరించి భూములు ఇవ్వాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలలో పోటీ పడే విధంగా కడతామన్నారు. కేసీఆర్ ట్యాంక్ బండ్ గురించి గొప్పలు చెప్పాడు.. పదేళ్లలో కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news