ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటానా.. ఇక నా రాజకీయం చూపిస్తా : రేవంత్

-

కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అంటున్నారని, అందుకే తాము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా సంయమనంతో ఉన్నానని, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా పని మొదలుపెట్టి తన రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు. తమ పార్టీలోకి ఒక గేటు తెరిచానని మొత్తం ఇంకా తెరవలేదని, అధిష్ఠానం సూచనల మేరకే చేరికలుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీలో ఎన్నికల పర్యటనలు చేస్తానని పేర్కొన్నారు. నాయకులు, అధికారులపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలుండవని రేవంత్ తేల్చి చెప్పారు. అవకతవకలపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆదివారం రోజున మీట్ ది మీడియా కార్యక్రమం నిర్వహించిన రేవంత్ ఓవైపు గత పాలకులపై విమర్శలు కురిపిస్తూ, తమ పాలనలో ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు వివరించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపైనా స్పందించారు. లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే పునరావృతం అవుతాయని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news