యాదాద్రి టెంపుల్ పనులపై కేసీఆర్ సమీక్ష..త్వరగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం..!

-

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.. కొత్త ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు.. టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, బస్టాండ్ తదితర నిర్మాణాల పురోగతిపై చర్చించారు..రెండు మూడు నెలల్లో ప్రారంభం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు..

నిర్మాణాలకు కావల్సిన నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తున్నదని.. ఆ మేరకు అధికారులు పనుల్లో వేగంపెంచాల్సిన అవసరముందన్నారు.. ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్లోకాలతో ప్రశాంతత ఫరిడవిల్లేలా.. ప్రకృతి సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని సూచించారు.. అయోధ్య, అక్షరధామ్‌ పుణ్యక్షేత్రాలకు మెరుగులద్దిన శిల్పులతో ఆలయానికి తుదిమెరుగులు దిద్దాలని ఆదేశించారు.. యాదాద్రికి చేరువలోఉన్న గండిచెరువును అద్భుతమైన ల్యాండ్‌స్కేపింగ్‌, వాటర్‌ ఫౌంటెన్లతో తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు తదితర కార్యక్రమాలను నిర్వహించుకొనేందుకు వీలుగా సుందరీకరణ పనులు చేయాలని ఆదేశించారు.

గుట్టమీదకు బస్సులు వెళ్లే మార్గాలు, వీఐపీ కార్‌ పార్కింగ్‌, కల్యాణకట్ట, పుష్కరిణిఘాట్‌, బ్రహ్మోత్సవ, కల్యాణమండపాల నిర్మాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్నందున యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రాధాన్యం మరింతగా పెరుగుతుందని, దేశ విదేశాల నుంచి రాజధానికి వచ్చే టూరిస్టులు దర్శించుకునే అవకాశాలుంటాయని కేసీఆర్‌ తెలిపారు.. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆలయపరిసరాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని అన్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా పెద్దపెద్ద చెట్లతో భవిష్యత్‌లో పచ్చదనం శోభిల్లేలా మొక్కలను నాటాలని.. వేప, రావి, సిల్వర్‌ వోక్‌ తదితర ఎత్తుగా పెరిగే చెట్లను పెంచాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news