ఇదీ ప్రస్థానం : 88లోనే ప్రెసిడెంట్ గా బైడెన్ పోటీ.. మరిన్నో ట్విస్ట్ లు…!

అమెరికాకి 46వ అధ్యక్షుడిగా జో బైడేన్ ఎన్నికయ్యారు. అయితే ఆయన జీవితం ఏమి పూలపాన్పు కాదు, ఎన్నో ఓటముల అనంతరం ఆయన అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు. ఒకసారి ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను పరిశీలిద్దాం. జో బైడేన్ 1942 నవంబరు 20న జన్మించారు. తన ఇరవై ఆరేళ్ళ వయసులో అంటే 1966లో నీలియా హంటర్ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు, అయితే బైడెన్ తొలిసారిగా సెనేటర్ గా ఎన్నికైన నెలరోజుల్లోనే ఒక రోడ్డు ప్రమాదంలో భార్య కుమార్తె మృతి చెందగా కుమారులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఆ సమయంలోనే ఆయన సెనేటర్ గా కుమారులు ఇద్దరూ చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఆవరణలోనే ప్రమాణస్వీకారం చేసి చర్చనీయాంశంగా మారారు. ఈయనకు 77 ఏళ్ళ వయసులో బయటనే అధ్యక్ష పదవి కల సాకారమైంది.

1988 లోనే ఈయన అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయగా కొన్ని అనివార్య కారణాలవల్ల పోటీ నుంచి ముందుగానే తప్పుకోవాల్సి వచ్చింది 2008లో కూడా ఆయన అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడగా అప్పుడు కూడా ఒక శాతం ఓటింగ్ తేడా రావడంతో మళ్లీ ఓటమి పలకరించింది. అయితే ఆ తర్వాత ఈయన వైస్ ప్రెసిడెంట్ గా ఒబామా ప్రెసిడెంట్ గా రెండు పర్యాయాలు మంచి పాలన అందించారు. ఒబామా హయాంలో రెండుసార్లు వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించిన ఈయన మొత్తం 6 సార్లు సెనేటర్ గా ఎంపికయ్యారు. 1972 లోనే 29 ఏళ్ల వయసులో ఆయన తొలిసారి సెనేటర్ గా ఎన్నికయ్యాడు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఎన్నికయిన నెలరోజులకే రోడ్డు ప్రమాదంలో భార్య కుమార్తెను కోల్పోవాల్సి వచ్చింది. 1977లో జిల్ అనే ఆమెను ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు.