కలెక్టర్ల సమీక్ష తర్వాత సీఎం గుడ్ న్యూస్ చెబుతారు : మంత్రి పొంగులేటి

-

కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా వెల్లడించారు. గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితం అయ్యిందని విమర్శించారు. హుజూర్నగర్ లో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి పొంగులేటి పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. హోసూర్ నగర్ లో గత ప్రభుత్వం కేవలం 150 ఇల్లు మాత్రమే కట్టించిందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామంలో 100కు పైగా ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు.

హుజూర్నగర్ లో 2000 160 ఇండ్లు పూర్తి చేసి రాబోయే మూడు నాలుగు నెలల్లో అర్హులైన పేదలందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఇరిగేషన్ పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, దుర్మార్గ పాలన సాగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news