తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు శుభవార్త..పీఆర్సీపై కీలక ప్రకటన

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు శుభవార్త. పీఆర్సీపై కీలక ప్రకటన వెలువడింది. విద్యుత్ ఉద్యోగుల పిఆర్సి పై త్వరలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఉద్యోగులు వినియోగదారుల సేవలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

సోమవారం హైదరాబాదులోని విద్యుత్ సౌదలో రాష్ట్ర విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం డైరీని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి రఘురామరెడ్డి తో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో 24 గంటలు నిరంతర విద్యుత్ సరాఫరా చేస్తున్నామని, కరెంటు లే క పంటలు ఎండిపోయే పరిస్థితులు ఎక్కడ లేవన్నారు. “కోవిడ్ తో రెండేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు రూ.1300 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వీటి నష్టాలకు కేంద్రం విధానాలు కూడా ఒక కారణం” అన్నారు.