వారంలోగా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లను పూర్తి చేయండి

-

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 7 జిల్లాలలో మంజూరు చేసిన నూతన మెడికల్ కాలేజీ (Medical Colleges)ల నిర్మాణం కోసం గుర్తించిన భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల నిర్మాణాల పూర్తి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణికి సంబంధించిన విషయాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా 12 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్‌లను వారంలోగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగతా జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణంకోసం టీఎస్ఐఐసీకి భూములు హ్యాండ్ ఓవర్ చేసేలా చర్యలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం ఇటీవల 7 జిల్లాలలో మంజూరు చేసిన నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం గుర్తించిన భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు.

అలానే ధరణిలో పెండింగ్ మ్యుటేషన్లు, భూవిషయాలకు సంబంధించిన గ్రీవియన్స్ మాడ్యూల్, ప్రొహిబిటరీ ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించి, జూన్ 9 లోగా వాటిని పరిష్కరించి తద్వారా సదరు రైతులు రైతుబంధు సహాయం పొందేలా చూడాలని ఆదేశించారు. స్పెషల్ ట్రిబ్యునల్ లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్ లను నిర్వహించాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news