కాంగ్రెస్, బీఆర్ఎస్ ది ఒక్కటే సిద్దాంతం : మోడీ 

-

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ది ఒక్కటే సిద్దాంతం అని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ ఇందూరు గర్జన సభలో మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటే సిద్దాంతాన్ని అనుసరిస్తాయని.. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వడం.. ఎన్నికల తరువాత వాటిని మరిచిపోవడమే వాళ్ల సిద్ధాంత అని పేర్కొన్నారు ప్రధాని మోడీ. అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతోంది.

కర్ణాటక ఎన్నికల మాదిరిగానే బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తుంది. దక్షిణ భారతదేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ తీరు చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు ప్రధాని మోడీ. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వమని.. మేయర్‌ పదవి బీజేపీకి ఇస్తానని కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి నన్ను అడిగారు.. తాను కూడా ఎన్డీఏలో చేరతానని కేసీఆర్‌ అడిగారు.. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని మేం చెప్పాం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ నాకు స్వాగతం పలికేవారు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీన్‌ మారిపోయింది. నేను కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్‌ మరోసారి ఢిల్లీ వచ్చి నాతో చెప్పారు.. మీరు ఏమైనా రాజులా? యువరాజును సీఎం చేయడానికి అని అడిగాను.. కేసీఆర్‌ అవినీతి బాగోతాన్ని నేను చెప్పాను.. ఆ తర్వాత నుంచి కేసీఆర్‌ నన్ను కలవడం లేదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version