కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు

-

మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఉద్దేశిస్తూ పల్లీ బఠానీ అంటూ కేటీఆర్‌ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌కు ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి బిట్స్‌ పిలానీలో డిగ్రీ పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం వరకు బాగానే ఉందని మల్లు రవి అన్నారు. ఇతర కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసిన వారిని పల్లీ బఠానీ అని అవమానపరిచేట్లు వ్యాఖ్యలు చేయడం నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన ఆరోపించారు. బిట్స్‌ పిలాని – పల్లి బఠానిల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని మల్లు రవి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news