దళితులు, దివ్యాంగుల బతుకులపైకి రేవంత్ రెడ్డి బుల్డోజర్ ఎక్కించింది. తాజాగా మహబూబ్‌నగర్ ఆదర్శనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు లేకుండా ఇండ్లు కూల్చివేసింది. ఏకంగా దళితులు, దివ్యాంగులకు సంబంధించిన 83 ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసింది.
ఇక సంఘటన ప్రాంతంలో, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు అల్పాహారం అందజేశారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు. రాత్రి పడుకునేందుకు షెడ్డు కూడా ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ ఆదర్శ నగర్లో 83 మంది దళిత, వికలాంగులకు సంబంధించిన ఇల్లు కూల్చిన నేపథ్యంలో కంటతడి పెట్టిస్తున్నాయి వికలాంగుల బాధలు. కనీసం ఇంట్లో సామాన్లు బైట పెట్టుకునే సమయం ఇవ్వలేదని చెప్తున్నారు బాధితులు.