దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించిపోయింది – ఈటెల రాజేందర్

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించిపోయిందని అన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని మిడిసి పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ కు మూలమైన యూపీలోనే కాంగ్రెస్ రెండే సీట్లు గెలిచిందని అన్నారు ఈటెల. ఎనిమిదేళ్ల కాలంలో సమస్యలు వస్తే ప్రగతి భవన్, సచివాలయంలో కలిసే భాగ్యం దక్కిందా ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎక్కడ చూసినా కేసీఆర్ ను బొంద పెట్టే నినాదమే వినిపిస్తోంది అన్నారు ఈటెల.

తాను కారులో వస్తున్నప్పుడు ఒక ముఖ్య వ్యక్తి ఫోన్ చేసి బిజెపి వైపు చూస్తున్నట్లు తెలిపారని.. కానీ నా ఫోన్ టాపింగ్ చేస్తారని చెబితే వినాలనే చెబుతున్నానని వారు తెలిపినట్లు అన్నారు ఈటెల. కెసిఆర్ నీ వెన్ను నీకు కనబడడం లేదు… ప్రజలకు కనబడుతోందన్నారు. రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీలు బిజెపిలో చేరితామని ఫోన్ చేస్తున్నట్లు తెలిపారు ఈటెల. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.