తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. భద్రాచలం దేవస్థానానికి ఆహ్వానం ఇవ్వలేదు : వీ.హెచ్

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే వివక్షతోనే భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానంకు అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి దగ్గర రాజకీయాలు తగ్గదని దేవుడు ముందు అందరూ సమానమేనని ఈ సందర్భంగా తెలియజేశారు.

అయోధ్య తరువాత అంతటి చరిత్ర కలిగినటువంటి ఏకైక దేవస్థానం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు అన్నారు. దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలువబడుతున్న ఈ దేవస్థానం కి ఆహ్వానం రాకపోవడం చాలా విచారకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ పార్టీ ఇలాంటి నీచమైన ఆలోచన చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు. భద్రాచల రామాలయానికి ఆహ్వానం పంపించకపోవడంతో తెలంగాణను అవమానించడమేనని వీ.హెచ్. ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news