జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో : సీఎం రేవంత్ రెడ్డి

-

జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు  సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ కి తెలంగాణ ప్రత్యేక ప్రాంతం.. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈనెల 06న నిర్వహించే జనజాతర సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలుప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారని తెలిపారు.

5 గ్యారెంటీలతో మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్  తెలంగాణ రాష్ట్రం కోలుకోలేకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు. సోనియాగాంధీ సూపర్ సిక్స్ ఆరు గ్యారెంటీలను ఇచ్చారని తెలిపారు.ప్రతీ గ్రామం నుంచి తెలంగాణ ప్రజలు, దళితులు, మైనార్టీలు, బీసీలు.. మహిళలకు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరు కావాలని తెలిపారు. ప్రతీ ఆడబిడ్డకు ప్రత్యేకంగా నిర్వహణ కార్యక్రమాలను చూసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news