మంచిర్యాల కాంగ్రెస్ నేతల భాగోతం బయటపడింది…పోలీస్ స్టేషన్ గేటు ముందే బర్త్ డే వేడుకలు చేసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత పుట్టిన రోజు వేడుకలు…వివాదంగా మారాయి. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ గేటు ముందు కాంగ్రెస్ పార్టీ నేత పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు అనుచరులు.
పోలీస్ స్టేషన్ గేటు ముందు బైక్ నిలిపి కేక్ కట్ చేశాడు తిరుపతి అనే కాంగ్రెస్ నాయకుడు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ నేత తిరుపతి పుట్టిన రోజు వేడుకల్లో మండల నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో లు..సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.