టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. 20 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

-

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం 22 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ కూడా ఆవిర్భావ వేడుకలపై ఓ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్ర వ్యాప్తంగా 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై నేతలు చర్చించారు. ఇకపై ప్రతినెలా మొదటి వారంలో పీఏసీ భేటీ జరగాలని వారు అన్నారు.

 ప్రతి నెల మొదటి వారంలో పీఏసీ సమావేశాలు నిర్వహిస్తామని.. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ తెలిపారు. జూన్ 2 నుంచి బీఆర్ఎస్ వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమం చేపడతామని వివరించారు. ప్రతి మండల కేంద్రంలో పార్టీ జెండాతో పాటు.. జాతీయ జెండాను ఎగురవేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు తమ ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు. 20 రోజుల కార్యక్రమంలో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఆహ్వానించాలని నిర్ణయించామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news