డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు .. పూర్తి వివరాలు ఇవే..

-

డిగ్రీ పాసయ్యారా? బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంకులో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. SBI యొక్క ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అవసరమైన అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు ఫారమ్‌ను నింపాలి. చివరి తేదీ తర్వాత దరఖాస్తులు అంగీకరించబడవు. ఈ రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SCO పోస్ట్ ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి, SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inను సందర్శించాలి. ఈ పోస్ట్‌ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 5, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఇకపోతే పూర్తి వివరాలు..

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ – 1 పోస్ట్

చీఫ్ మేనేజర్ – 5 పోస్టులు

ప్రాజెక్ట్ మేనేజర్ – 6 పోస్టులు

మేనేజర్ – 30 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ – 8 పోస్టులు

ఈ నియామకాలు వివిధ రంగాలకు సంబంధించినవి.. ఇక ఈ జాబ్స్ కు అప్లై చేసే వాళ్లకు వయస్సు 28 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి..కొన్ని B.Tech, M.Tech అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పోస్టుకు పని అనుభవం కూడా ఉండాలని పేర్కొన్నారు. దిగువ ఇచ్చిన నోటీసు లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు…మరింత సమాచారం కొరకు బ్యాంకు వెబ్ సైట్ ను సందర్శించండి..

Read more RELATED
Recommended to you

Latest news