కేటీఆర్ ట్వీట్ కి కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నేటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవ్వరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మ్రోగించింది. ప్రగతి భవన్.. డాక్టర్ అంబేద్కర్ భవన్ గా మారుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు ధన్యవాదాలు. రెండు సార్లు ప్రజలు మాకు అవకాశం కల్పించారు. ఈ సారి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. అయితే నిన్న కేటీఆర్ మళ్లీ హ్యాట్రిక్ బీఆర్ఎస్ సాధిస్తుందని చెప్పారు కేటీఆర్. అయితే నిన్న కేటీఆర్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

హ్యాట్రిక్ లోడింగ్.. 3.0.. గెట్ రెడీ టూ సెలబ్రెట్స్ గాయ్స్.. అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తావిస్తూ.. గురి తప్పలేదు. కారు నాలుగు టైర్లు పేల్చేసిన కేటీఆర్ అంటూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. వేర్ యూ ఏమింగ్ ఫర్ కారు టైర్స్ అని రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news