కాసేపట్లో రాజ్‌భవన్‌కు కేసీఆర్‌.. రాజీనామా చేయనున్న కేసీఆర్‌

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో హ్యాట్రిక్ కొడతానని భావించారు. క్యాబినెట్ సమావేశం నిర్వహించాలనుకున్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో రాజీనామా చేయాలని సిద్ధమయ్యారు కేసీఆర్. మరికొద్ది కాసేపట్లోనే కేసీఆర్ రాజ్ భవన్ కి బయలుదేరనున్నారు.

పరాభవం ఊహించకపోవడంతో.. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి పదవీకి కేసీఆర్ రాజీనామా చేయనున్నారు. ఏమాత్రం ఊహించని విధంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిందో.. బీఆర్ఎస్ పార్టీకి ఉత్తర తెలంగాణతో పాటు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఓటమిని ఖాయం చేశాయి. కాంగ్రెస్ ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలు భారీ సీట్లను ఇచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు బీఆర్ఎస్ కి మంచి ఫలితాలను అందించాయి. రంగారెడ్డిలో ఇబ్రాహీంపట్నంలో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 08, ఎంఐఎం 07, బీఆర్ఎస్ 39, స్థానాల్లో విజయం సాధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news