1,864 స్కూళ్లను మూసివేసే కుట్ర.. సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ట్వీట్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థంగా మార్చేసిందని సీరియస్ అయ్యారు. విద్యార్థులు లేరంటూ 1,864 స్కూళ్లను మూసివేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. పేద,మధ్య తరగతి విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు.

ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్ల నియామకం, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు. ప్రమాదం అంచున ప్రభుత్వ విద్య ఉందని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రభుత్వ విద్యార్థుల గోడును పట్టించుకోవాలని, విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news