క‌రోనా ఎఫెక్ట్ : గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌ వేదిక మార్పు

-

దేశ వ్యాప్తంగా క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఏమాత్రం త‌గ్గ‌కుండా ప్ర‌తి రోజు వేల సంఖ్య‌లో కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే క‌రోనా వ్యాప్తి తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్ర‌భావం గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌పై ప‌డింది. ఏకంగా వేదిక‌నే మార్చే స్థితికి వ‌చ్చింది. ప్ర‌తి ఏడాది గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌బ్లిక్ గార్డెన్ లో నిర్వ‌హించేది. కానీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ ఉన్న నేప‌థ్యంలో వేదిక‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మార్చింది.

ఈ ఏడాది గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ అధికారిక నివాసం రాజ్ భ‌వ‌న్ లో నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించారు. ఈ ఏడాది రాజ్ భ‌వ‌న్ లోనే గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర‌రాజ‌న్ జాతీయ జెండాను ఆవిష్క‌రించ‌నున్నారు. కాగ గ‌తంలో ఎప్పుడూ కూడా రాజ్ భ‌వ‌న్ లో గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌ను నిర్వ‌హించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news