కరోనా ఎఫెక్ట్… హైదరాబాద్‌లోనూ ఆంక్షలు షురూ

-

భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో కొత్తగా 2,055 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక నగరంలో నిత్యం రద్దీగా ఉండే బేగం బజార్ పై కరోనా తన పంజా విసిరింది.

బేగం బజార్ మార్కెట్లోని దాదాపు 100 మంది వ్యాపారులకు కరోనా సోకింది. అయితే మార్కెట్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మార్కెట్ ను తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమ్మల్లోకి రానుంది. కాగా మార్కెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో శుక్రవారం నుంచి ప్రతి రోజు సాయంత్రం 5 గంటల తర్వాత మార్కెట్ లోని దుకాణాలు మూతపడనున్నాయి. కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.

కాగా బేగంబజార్‌కు రోజు దాదాపు 50 వేల మంది వరకు వినియోగదారులు వస్తుంటారు. బేగంబజార్‌తో పాటు ఛత్రి, ఫిష్‌ మార్కెట్, మిట్టికా షేర్‌ తదితర ప్రాంతాల్లోని దుకాణాదారులు కూడా ఈ నిబంధనలు పాటించనున్నాయి. కాగా దుకాణాలకు వచ్చే వినియోగదారులు మాస్క్‌లు తప్పనిసరి ధరించాలని బేగం బజార్ మార్కెట్ అసోసియేషన్ కోరుతోంది. అలానే వినియోగదారులు శానిటైజర్‌ వాడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news