సైబరాబాద్ లో రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేసారు పోలీసులు. ఆరు నెలల కాలంలో ఈ ఫోన్లు రికవరీ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సిఈఐ ర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు పేర్కొన పోలీసులు.. వీటి విలువ దాదాపు 5కోట్ల రూపాయలు ఉంటుంది అని అన్నారు. అయితే తాజాగా 800 సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందజేసారు పోలీసులు.
ఈ సందర్భంగా సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నర్సింహ మాట్లాడుతూ.. 2.4 కోట్ల రూపాయల విలువైన 800 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశాం. యాభై మంది పోలీసులు నెలన్నర రోజులు కష్టపడి ఈ ఫోన్లు రికవరీ చేశారు. గత ఆరు నెలలుగా రెండు వేల ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు అమ్మినా, కొన్నా కేసులు నమోదు అవుతాయి. ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని డీసీపీ సూచించారు.