బ్రేకింగ్ : నేడు కాంగ్రెస్ పార్టీలోకి డి.శ్రీనివాస్

బీఆర్ఎస్ పార్టీ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాణిక్ రావు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ధర్మపురి శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో కీలక నేతగా ఉండేవారు. రెండుసార్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే మంత్రిగా కూడా పనిచేశారు ధర్మపురి శ్రీనివాస్. ఆ తర్వాత కెసిఆర్ పార్టీలో చేరారు. ఈ తరుణంలోనే రాజ్యసభ సీటు కూడా దక్కించుకున్నారు ధర్మపురి శ్రీనివాస్. ఈయన మరో కుమారుడు అరవిందు నిజామాబాద్ బిజెపి ఎంపీగా పనిచేస్తున్నారు.  రాజ్యసభ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.