పేరుకు డ్యాన్స్ మాస్టర్.. చేసేది మాత్రం మహిళల ట్రాపింగ్ !

అతనో డ్యాన్స్ మాస్టర్, అది పైకి కనిపించేది, కానీ ఆ వృత్తిని అడ్డం పెట్టుకుని అతను చేసేది మాత్రం మహిళల ట్రాపింగ్. తాజాగా మహిళల అలానే విద్యార్థునుల అసభ్యకర ఫొటోస్ తీసి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఒక ఇంజినీరింగ్ కళాశాలకి చెందిన డాన్స్ మాస్టర్ అస్లాంని మీర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశాయి. నిందితుడు మంచాల మండలం అరుట్ల గ్రామానికి చెందిన వ్యక్తీ కాగా అతని మీద ఉప్పల్ మరియు కందుకూరు పోలీస్ స్టేషన్ లలో భాదితుల ఫిర్యాదుతో కేస్ లు నమోదయ్యాయి.

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అదే ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేసే ఒక మహిళతో స్నేహంగా ఉంటూ ఆమెకి తెలియకుండా అసభ్యంగా ఫోటోలు తీసి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఆమె అంత ఇచ్చుకోలేనని 10 వేలు ఇచ్చింది. అయినా అతను వేదిస్తుండడంతో పోలీస్ కేసు పెట్టింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అస్లాం పై 384, 354B 417,420, IPC & SEC 67,IT Act 2000 కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.