Debate on loan waiver in Telangana Assembly today: తెలంగాణ రాష్ట్ర రైతులకు ఊరట కలిగించేలా ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా అమలు అయిన రెండు లక్షల రుణమాఫీ పై..రుణమాఫీ పై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

ఇవాళ అసెంబ్లీలో రెండు లక్షల రుణమాఫీ పై కీలక చర్చ నిర్వహించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ చర్చకు అనుమతించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలను స్పీకర్ కూడా ఆమోదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. గురువారం రోజున ప్రవేశపెట్టబోతుంది. సభ్యులలో అవగాహన తెచ్చుకునేందుకు ఈనెల 26వ తేదీన… అంటే ఎల్లుండి హాలిడే ఇవ్వనున్నారు. ఇక ఈనెల 27 అలాగే 28 తేదీల్లో అసెంబ్లీ బడ్జెట్ పై చర్చ ఉంటుంది.