కేఆర్ఎంబీ ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు : హరీశ్ రావు

-

కేఆర్ఎంబీ ప్రాజెక్టులను అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తి గత దూషణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేఆర్ఎంబీ ప్రాజెక్టులను అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఒకవేళ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే.. అన్ని పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. అప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు హరీశ్ రావు. నెలరోజులుగా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తారని సమావేశంలో స్పష్టం చేశారు. 2024 ఫిబ్రవరి 01న కేఆర్ఎంబీ మీటింగ్ జరిగిందని హరీశ్ రావు తెలిపారు. ప్రాజెక్టులను అప్పగించిన తరువాత.. అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రంకెలేస్తుందన్నారు హరీశ్ రావు. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్టు మీటింగ్ మినిట్స్ ఉన్నదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news