త్వరలోనే జ్ఞానవాపి పై నిజ నిజాలు బయటకు వస్తాయి : కిషన్ రెడ్డి

-

త్వరలోనే జ్ఞానవాపి పై నిజ నిజాలు బయటికి వస్తాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే తొలి ఎఫీగ్రఫీ మ్యూజియంకు ఇవాళ సాలర్ జంగ్ మ్యూజియం వద్ద  కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తొలి ఎఫీగ్రఫీ మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎఫీగ్రఫీ మ్యూజియంలో ప్రాచీన శాసనాల ప్రదర్శన వాటిపై అధ్యయనం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటి ఏపిగ్రఫీ మ్యూజియం హైదరాబాద్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.  ఇవాళ భూమి పూజ చేసుకున్నామన్నారు కిషన్ రెడ్డి.

శిలా శాసనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.దేశం పై అనేకమంది దండయాత్రలు చేయడం వల్ల గత చరిత్ర శిలా శాసనాలు కనుమరుగు అయ్యాయని తెలిపారు. శిలా శాసనాలపై రకరకాల లిపి ఉంటుంది. అది వారి జీవన విధానానికి అడ్డుపడుతోందన్నారు. శాసనాలు దేశ చరిత్రకు వెన్నెముక లాంటిదన్నారు. శాసనాలను కాపాడాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రకరకాల లిపిన రూపంలో శాసనాలు కనిపిస్తున్నాయన్నారు. జ్ఞానవాపిలో కూడా అనేక శాసనాలు ఉన్నాయని.. జ్ఞానవాపిలో ఉన్న చరిత్రను ప్రజల ముందుకు తెచ్చేందుకు  ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎఫీగ్రఫీ డిపార్ట్మెంట్  కృషితో జ్ఞానవాపిలో ఉన్న ఆధారాలను రీసెర్చ్ చేసి కోర్టు ముందు ఉంచారన్నారు. కోర్టు చాలా తక్కువ సమయం ఇచ్చిందని త్వరలోనే జ్ఞానవాపిపై నిజ నిజాలు బయటికి వస్తాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news