మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. డీజే సిద్ధార్థతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు

-

మాదాపూర్ డ్రస్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. DJ సిద్ధార్థతో సహా మరో వ్యక్టి కొకైన్ & గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయింది. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. మాదాపూర్ & గచ్చిబౌలి పబ్ లో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న 16 మందిని పిలిపించి పరీక్షలు నిర్వహించారు. యూరిన్ బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల రిపోర్ట్ లో తేలింది. డీజే సిద్ధార్థ తో పాటు మరో వ్యక్తిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.U/s. 27 NDPS చట్టం, 1985 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

పబ్స్ వద్ద డ్రగ్స్ వినియోగదారులపై నిఘా కూడా పెట్టారు. పబ్బుల వద్ద డ్రగ్స్ డిటెక్టివ్ పరికరాలతో పరీక్షలు నిర్వహించింది ఎన్సీబీ.డీజే సిద్ధార్థ తో పాటు మరో వ్యక్తి స్వరూప్ ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అవడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. గత కొంతకాలంగా డీజే సిద్ధార్థ కదలికలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. డ్రగ్స్ కేసులో ఇంకెవరెవరికి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news