ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది ఢిల్లీ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురి అయ్యారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న ఎమ్మెల్సీ కవిత మొన్న నీరసంతో కళ్లు తిరిగిపడిపోయింది.
దీంతో అధికారులు వెంటనే కవితని ఢిల్లీలోని దీన్ దయాళ్ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు కవితకు చికిత్స అందించారు. ఇక నిన్న కవిత ఆరోగ్యం కుదుటపడటంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. దీంతో అధికారులు ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కవిత క్షేమంగా ఉన్నారని తెలియడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఊపీరి పీల్చుకున్నారు. అయితే మళ్ళీ ఆమె ఆరోగ్యం మొదటికి వచ్చిందట. దింతో ఆమెకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది ఢిల్లీ కోర్టు.