నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జాబ్ క్యాలెండర్

-

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసన సభ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది. బంగారు తెలంగాణ చేస్తామని ప్రగల్బాలు పలికారు. ఒంటెత్తు పోకడలతో ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్య శ్రీ రూ.10లక్షల వరకు పెంచాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ వేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందింది. ఓ వైపు అప్పులు.. మరోవైపు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. తెలంగాణ రాష్ట్రానికి రూ.2,91,159 కోట్లతో  బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఏదో ఒక విధంగా గెలవాలని హామీలు ఇవ్వలేదు. కచ్చితంగా ప్రజలకు మేలు జరగాలనే హామీలు ఇచ్చామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news