మెదక్ జిల్లాలో విషాదం..డిప్యూటీ MRO స్టీఫెన్ మృతి

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని ఓ డిప్యూటీ MRO స్టీఫెన్ మృతి చెందాడు. హార్ట్ స్ట్రోక్ తో నర్సాపూర్ డిప్యూటీ MRO స్టీఫెన్ మృతి చెందాడు. ఇవాళ ఉదయం నర్సాపూర్ లోని ఇంట్లో ఒక్కసారిగా డిప్యూటీ MRO స్టీఫెన్ కుప్పకూలిపోయాడు.

ఇక దీంతో అలర్ట్‌ అయిన ఆయన కుటుంబ సభ్యులు..ఆస్పత్రికి తీసుకెందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, హాస్పటల్ కి తీసుకువెళ్లే లోపే మృతి చెందారు డిప్యూటీ MRO స్టీఫెన్. హార్ట్ స్ట్రోక్ తో చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం పొంది, నర్సాపూర్లో డిప్యూటీ MROగా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్.. ఇలా మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.