వారికి కేంద్రం గుడ్ న్యూస్.. నెలకు రూ.3000..!

-

మోడీ ప్రభుత్వం వివిధ రకాల పథకాలను తీసుకు రావడం జరిగింది. ఆర్ధిక ఇబ్బందులని తొలగించేందుకు పలు రకాల స్కీమ్‌లను తీసుకు వచ్చింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళ కోసం ‘ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన’ స్కీమ్ ని తెచ్చింది.

- Advertisement -

ఇక పూర్తి వివరాలని చూస్తే… ఈ పథకం కింద కార్మికులు కనీసం రూ.3000 వరకు పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ 60 సంవత్సరాలు నిండినప్పుడు వస్తుంది. ఒకవేళ కనుక పెన్షనర్ మరణిస్తే అతని భార్య లేదా భర్త కుటుంబానికి సగం డబ్బులు వస్తాయి.

ప్రధానమంత్రి శ్రామిక్ యోగి మన్‌ధన్ యోజన అర్హత వివరాలు:

ఇందులో డబ్బులు పెట్టాలంటే కార్మికుడి నెలవారీ ఆదాయం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ మాత్రమే ఉండాలి.
వయస్సు అయితే 18-40 సంవత్సరాలు ఉండాలి.
జాతీయ పెన్షన్ సిస్టమ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్ లేదా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడు కి వర్తిస్తుంది.
అలానే ఆ కార్మికుడు లేదా ఉద్యోగికి కూడా వర్తిస్తుంది.
మాన్ ధన్ యోజన ప్రయోజనం ఆదాయపు పన్ను చెల్లించని వారు దీనికి అర్హులే.
ఉద్యోగి 60 ఏళ్ల వయస్సు వరకు డబ్బులు కట్టాలి. ఎలాంటి అంతరాయం లేకుండా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. 60 ఏళ్ల తర్వాత ఈ డిపాజిట్ ఆధారంగా పెన్షన్ వస్తుంది.

ఎంత డబ్బులు వస్తాయి..?

ప్రతి నెలా మాన్ ధన్ యోజనలో 100 రూపాయలు కడితే ఆ తర్వాత 100 రూపాయలు కూడా అతని ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇది 60 సంవత్సరాల వయస్సు వరకు నడుస్తుంది. లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య 50-50 ప్రాతిపదికన డబ్బు జమ చేయడం జరుగుతుంది.

ప్రధానమంత్రి శ్రామిక్ యోగి మన్‌ధన్ యోజన కింద ఎంత డబ్బులు వస్తాయి..?

29 సంవత్సరాల వయస్సులో చేరితే ప్రతి నెలా రూ.100 జమ చేయగా కేంద్రం ద్వారా రూ.100 పడతాయి.
31 ఏళ్ల వరకు లబ్ధిదారుడు ప్రభుత్వం ఖాతాలో రూ.100-100 పడుతూ ఉంటాయి.
60 ఏళ్లు పూర్తయిన తర్వాత లబ్ధిదారునికి ప్రతి నెలా రూ.3000 పెన్షన్ వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...