పౌర్ణమి చంద్రుడి ప్రభావం మనిషి ఆరోగ్యంపై ఉంటుంది.. మూడ్‌ స్వింగ్స్‌, హార్ట్‌ బీట్‌ ఇంకా..

-

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కొంత మంది ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. వారి ప్రతీ దానికి కోపం తెచ్చుకుంటారు. మూడ్ స్వింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాళ్లకు కూడా వీరి గురించి తెలుసు.. అమావాస్య కదా ఇలానే చేస్తాడులే అంటుంటారు. అంటే మనిషి ఆరోగ్యంపై చంద్రుడి ప్రభావం ఉంటుందా..? ఇందులో నిజం ఎంత ఉంది..? సూర్యుడి వల్ల అంటే విటమిన్‌ డీ వస్తుంది కాబట్టి.. ఎఫెక్ట్‌ ఉంటుంది అనుకోవచ్చు. చంద్రుడి వల్ల ఏం జరుగుతుందబ్బా..? పౌర్ణమి నాటి చంద్రుడు ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. పౌర్ణమి చంద్రుడు, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావాలకు సంబంధించి పరిశోధకులు కనుగొన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.

హార్ట్‌ బీట్‌ పెరుగుతుంది..

చంద్రుని చక్రాలు మనిషి హృదయ స్పందనలపై ప్రభావం చూపుతాయని అధ్యయనం ద్వారా కనుగొన్నారు. పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో వ్యాయామాలు చేస్తున్నప్పుడు హృదయ స్పందనలు సాధారణం కంటే మరింత హెచ్చుగా ఉంటాయట. కాబట్టి ఎప్పుడైనా వ్యాయామాలు చేసేటపుడు అమావాస్య లేదా పౌర్ణమి రోజు వ్యాయామ తీవ్రత తగ్గించుకోండి, లేదా ఆరోజు చేయకండి.

మూడ్ స్వింగ్స్‌

మనిషి మెదడులో ఆటుపోట్లకు చంద్రుడు కారణం కావచ్చు. మెదడులో నీటి శాతం ఎక్కువ ఉన్నందున, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మీ మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని డచ్ పరిశోధకులు అంటున్నారు. ఈ కారణంగా పౌర్ణమి లేదా అమావాస్య రోజున మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయనేది డచ్ పరిశోధకుల అభిప్రాయం.

బ్రిటీష్ శాస్త్రవేత్తలు చేసిన ఇతర అధ్యయనాల ప్రకారం నిండు పౌర్ణమి , మూర్ఛ వ్యాధిగ్రస్తులలో మూర్ఛలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు, మూర్చ రోగుల్లో ఎపిలెప్టిక్ మూర్ఛలు తక్కువ ఉన్నట్లు వారు గమనించారు. సూర్యుడు అస్తమించినప్పుడు మీ మెదడులో సహజంగా స్రవించే మెలటోనిన్ అనే హార్మోన్ దీనికి కారణం అవుతుందట. పౌర్ణమి రోజు ఈ హార్మోన్ శాంత ప్రభావాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు.

నిద్ర చక్రంలో మార్పులు

చంద్రకాంతి మనిషి నిద్ర విధానాలపై ప్రభావం చూపుతుందని కరెంట్ బయాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం చెబుతోంది. ప్రకాశవంతమైన చంద్రుడు ఉన్నప్పుడు మెలటోనిన్ స్థాయిలు తక్కువగా ఉండటమే కాకుండా, నిద్రపోవడానికి 5 నిమిషాలు ఎక్కువ సమయం పట్టిందని, అలాగే సాధారణం కంటే 20 నిమిషాలు తక్కువ నిద్రపోతారని పరిశోధకులు గుర్తించారు. రోజూవారీగా కంటే 30 శాతం తక్కువ REM ఉందని పరిశోధకులు నిర్ధారించారు.

స్త్రీలలో ఋతుచక్రంపై ప్రభావం

స్త్రీలలో సగటు ఋతు చక్రం 28 రోజులు, ఇది 29+ రోజుల చంద్ర చక్రంతో సమానంగా ఉంటుంది. చైనీస్ పరిశోధకుల ప్రకారం.. ఈ సమయం యాదృచ్చికం కాకపొవచ్చు, వారి పరిశోధనల్లో భాగంగా కొంతమంది స్త్రీల ఋతుచక్రాలను పర్యవేక్షించారు. దాదాపు వారందరిలో పౌర్ణమి దగ్గరలో అండోత్సర్గము, అమావాస్య సమయంలో ఋతుస్రావం అవుతుందని కనుగొన్నారు. భూమిపైన సంతానోత్పత్తికి చంద్రుడి ప్రభావానికి ఇది నిదర్శనం.

కిడ్నీ నొప్పి

యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పౌర్ణమి సమయంలో కిడ్నీ స్టోన్ నొప్పి అధికంగా ఉంటుందట. ఈ సమయంలో ఎక్కువ మంది రోగులు ఆసుపత్రులలో చేరారని కనుగొన్నారు. దీనికి విరుద్ధంగా, అమావాస్య రోజున కిడ్నీలలో నొప్పి నుంచి ఉపశమన ప్రభావాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, కిడ్నీ నొప్పిలో హెచ్చుతగ్గులకు చంద్రుని ప్రభావాలే కారణం అని కచ్చితమైన ఆధారాలు లేవు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.

ఇలా పౌర్ణమి చంద్రుడి ప్రభావం మన ఆరోగ్యంగంపై కచ్చితంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. అందుకే అమావాస్య, పౌర్ణమి రోజు కాస్త జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దలు.

Read more RELATED
Recommended to you

Latest news