కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు మంత్రి కేటీఆర్ ఇవాళ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కర్ణాటక అడ్డాగా మారిందని.. హైదరాబాద్ కి వచ్చే పలు కంపెనీలకు లేఖలు రాసి శివకుమార్ వాటిని బెంగళూరు తీసుకెళ్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఫాక్స్ కాన్ కంపెనీకి డీకే శివకుమార్ గత నెలలో లేఖ రాశారని.. చాలా కష్టపడి తెలంగాణ కు తీసుకొచ్చామని తెలిపారు. శివకుమార్ ఫాక్స్ కాన్ సీఈవోకి లేఖ రాసి ఆ కంపెనీ బెంగళూరుకి మార్చండి అంటూ చెప్పాడని తెలిపిన విషయం విధితమే.
తాజాగా యాపిల్ ఎయిర్ పాడ్ తయారీ ప్లాంట్ ను బెంగళూరుకు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం ఫాక్స్ కాన్ గ్రూపునకు లేఖ రాసినట్టు వస్తున్న వార్తలపై డీకే శివకుమార్ స్పందించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి తరలించాలని నేను కంపెనీకి లేఖ రాసినట్టు ఉన్న ఈ లెటర్ ఫేక్ అని స్పష్టం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్వీట్ లో వెల్లడించారు. ఇప్పటికే ఈ లేఖను తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ట్వీట్ చేయడం గమానర్హం.