రేవంత్‌రెడ్డికి నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: అరుణ

-

పాలమూరు జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తమపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డికి తాను సాటి కానప్పుడు తననెందుకు లక్ష్యంగా చేసుకున్నారని నిలదీశారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం రోజున పాలమూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి ఆరోపణలను తిప్పికొట్టిన డీకే అరుణ .. జిల్లాలో ఉంటే తాను చేసిన అభివృద్ధి కనిపించేదని అన్నారు. బీసీల కోసం రేవంత్‌ రెడ్డి చెబుతున్న మాటలన్నీ బోగస్ అని విమర్శించారు.

‘ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై సీఎం ప్రమాణం చేస్తున్నారు. దేవుళ్లపై కాకుండా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తే జనం నమ్ముతారు. దేవుళ్లపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. రేవంత్ చెప్పే అబద్ధాలకు దేవుళ్లు ఏం చేస్తారు? రేవంత్‌ రెడ్డికి నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు? కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌ రెడ్డి నెరవేర్చాలి అని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news