రేవంత్ కి అండగా బిజెపి ఉందా…?

-

తెలంగాణలో రేవంత్ రెడ్డిని బిజెపిలోకి తీసుకుని వెళ్ళడానికి గానూ బిజెపి అధిష్టానం తో పాటుగా రాష్ట్ర పార్టీ నేతలు కొన్ని రోజులుగా వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రేవంత్ కోసం కిషన్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ పార్టీ మారి వస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది.

ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఈ విధంగా ఆరోపణలు చేయడం వెనుక కచ్చితంగా ఇప్పుడు బిజెపి ఉందని అంటున్నారు. బిజెపి అండతో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు అని అందుకే కొందరు దీనిపై వేగంగా స్పందించారు అని అంటున్నారు. కేటిఆర్ ని టార్గెట్ చేయడానికి రేవంత్ బిజెపి అండ తీసుకుంటున్నారు అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

రేవంత్ కి బిజెపి రాష్ట్ర పార్టీ నుంచి అధిష్టానం నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉందని ఆయన త్వరలోనే పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. ఇక ఆయనను అందుకే పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ నేతలు వద్దు అని అంటున్నారు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా సరే బిజెపి అండదందలతో ఉన్న నేత అంటూ పలువురు పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news