జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో పరారైన డ్రైవర్‌

-

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌లో ఓ డ్రైవర్ తను పని చేస్తున్న కంపెనీకి సంబంధించిన డబ్బుతో పరారైన ఘటన చోటుచేసుకుంది. ఓ నిర్మాణ సంస్థకు చెందిన డ్రైవర్‌ రూ.1.2 కోట్లతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఆదిత్రి హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో ఖమ్మం జిల్లా కల్లూరు వాసి బానోతు సాయికుమార్‌ మాదాపూర్‌లో ఉంటూ మూడేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు ఈనెల 24న ఉదయం 8.30 గంటలకు రూ.1.2 కోట్లను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించారు.

సాయికుమార్‌ కార్యాలయ వాహనం ఇన్నోవా (టీఎస్‌08హెచ్‌పీ9788)లో డబ్బుతో బయలుదేరి కొద్దిదూరం వెళ్లి కారు వదిలేసి నగదుతో పరారయ్యాడు. డబ్బు ఇంట్లో ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్‌రావు డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా కలవలేదు. దీంతో ఏజీఎం షేక్‌ జిలానీ అదేరోజు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని ఆదివారం రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news