మన దేశ సంప్రాదాయాల్లో దేవుళ్ళకు పూజ చెయ్యడం కూడా చాలా ముఖ్యమైంది.. ఒక్కో దేవుడికి ఒక్కో. రోజు ఉంటుంది.. అందులో శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం..అయితే ఎంతోమంది ప్రజలు పరమేశ్వరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆది దేవుడైన ఆ పరమశివుడి అనుగ్రహం పొందడం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం శివుడి కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడింది..
పూర్వకాలంలో ఎంతోమంది మహా ఋషులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఘోరమైన తపస్సులు చేశారు. అయితే ప్రస్తుత కాలంలో అలాంటి తపస్సులు చేసేవారు లేకపోయినా కూడా నియమ నిష్టలతో పరమేశ్వరుడిని పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు.. ఇకపోతే పూర్వకాలంలో ఎంతోమంది మహా ఋషులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఘోరమైన తపస్సులు చేశారు. అయితే ప్రస్తుత కాలంలో అలాంటి తపస్సులు చేసేవారు లేకపోయినా కూడా నియమ నిష్టలతో పరమేశ్వరుడిని పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. శివుడి అనుగ్రహం పొందటానికి ఎలాంటి పూజా విధానాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పరమ పవిత్రమైన బిల్వదలాలను శివుడికి సమర్పించి పూజించాలి. ప్రతి సోమవారం ఇలా చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది.. అలాగే బిల్వ దళాలతో పాటు బిల్వ వృక్షాలకు పూసిన పువ్వులతో కూడా శివుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. పురాణాల ప్రకారం ఈ పువ్వులతో శివునికి పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారు అని ప్రజల విశ్వాసం. అలాగే శివునికి ఇష్టమైన పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది..ఆర్థికంగా పుంజుకుంటారు..