వివేకా కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు…వారికి రోజులు దగ్గర పడ్డాయి !

వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి రోజులు దగ్గర పడ్డాయంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. వివేకా హత్య కేసులో మరి కొన్ని రోజుల్లో నిజాలు తెలనున్నాయి..నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందని బాంబ్‌ పేల్చాడు. ఇంత కాలం దస్తగిరి చెప్పింది అపద్దం అన్నారు.. ఆ నిజాలు ఏమిటో ఇక తెలుస్తాయని వెల్లడించారు.

ఇటీవల కొందరిని విచారించారంటే, సమాచార ఉంటేనే విచారణకు పిలిచి ఉంటారని అవినాష్‌ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విచారణ కు జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తి అయ్యేదన్నారు. హైదరాబాద్ కు కేసు బదిలీ చేయడం మంచిదేనని తెలిపారు. హైదరాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు సమన్లు తెలుసుకునేందుకే సీబీఐ కార్యాలయం వచ్చానన్నారు డ్రైవర్ దస్తగిరి.