Droupadi Murmu: తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. ఇవాళే తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లేంత వరకు రాష్ట్రపతి వెంటే ఉండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్పీఎస్, పీఎన్టీ జంక్షన్, రసూల్ పురా, సీటీవో ప్లాజా, టీవోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బొల్లారంలోని నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్ తదితర శాఖలతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు.