యూట్యూబర్‌ ప్రణీత్ హనుమంత్‌పై డ్రగ్స్ కేసు

-

సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నాడని ప్రముఖ యూట్యూబర్‌ ప్రణీత్ హనుమంత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడిపై మరో కేసు నమోదైంది. ప్రణీత్‌ను ఇప్పటికే అరెస్టు చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతడిపై డ్రగ్స్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రణీత్‌ మత్తు పదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. ఈ క్రమంలోనే కేసు ఫైల్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రణీత్ చంచల్‌గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అతణ్ని 3 రోజుల కస్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో పోక్సో కోర్టు ప్రణీత్ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. 

అసలేం జరిగింది : సోషల్ మీడియాలో తండ్రి-కుమార్తె వీడియోపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోపై సినీనటుడు సాయిదుర్గ తేజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరికొంత మందికి ట్యాగ్ చేశారు. వెంటనే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ యూట్యూబర్, మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news