LIVE : దుబ్బాక – ట‌ఫ్ ఫైట్‌ : 1058 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ

-

దుబ్బాక ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌కియ కొన‌సాగుతుంది. బీజేపీ, టీఆర్ఎస్‌ల మ‌ధ్య పోటీ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. మొత్తం 23 రౌండ్లు కౌంటింగ్‌తో ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.

– 1 రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 341 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. టీఆర్ఎస్ 2867, బీజేపీ 3208, కాంగ్రెస్ 648, నోటా 24 ఓట్లు పోలయ్యాయి.

– 2వ రౌండ్ లో టీఆర్ఎస్ 1282, బీజేపీ 1561, కాంగ్రెస్ 648 పోలయ్యాయి. రెండో రౌండ్ లోనూ బీజేపీ 602 అధిక్యతలో ఉన్నది.

– 3వ రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి టీఆర్ఎస్ 7969, బీజేపీ9223, కాంగ్రెస్ 1559. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 1,885 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

– 4వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ 2684 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి బీజేపీ13055, టీఆర్ఎస్ 10371, కాంగ్రెస్ 2158.

– 5వ రౌండ్ : బీజేపీ 16517, టీఆర్ఎస్ 13497, కాంగ్రెస్2724. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 3020 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

– 6వ రౌండ్ కౌంటింగ్ పూర్త‌య్యే స‌మ‌యానికి టీఆర్ెస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత వెన‌కంజ‌లో ఉన్నారు. బీజేపీ 20226, టీఆర్ఎస్ 17559, కాంగ్రెస్ 3254. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 2667 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

– 7వ రౌండ్‌లో కూడా ర‌ఘునంద‌న్ రావు హ‌వా కొన‌సాగింది. బీజేపీ 22762, టీఆర్ఎస్ 20277, కాంగ్రెస్ 4003. బీజేపీ  2485 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

– 8 వ రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి బీజేపీ 25878, టీఆర్ఎస్ 22772, కాంగ్రెస్ 5125. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 3106 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

– 9వ రౌండ్ : బీజేపీ 25101, టీఆర్ఎస్ 29291, కాంగ్రెస్ 5800. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 4190 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

-10వ రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి బీజేపీ 31783, టీఆర్ఎస్ 28049, కాంగ్రెస్ 6699. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 3734 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

– 11వ రౌండ్ కౌంటింగ్ పూర్త‌య్యే స‌మ‌యానికి బిజెపికి 34748, టీఆర్ెస్ కి 30815, కాంగ్రెస్ పార్టీ కి 8582 ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి క‌నీసం పోటీ ఇవ్వ‌లేదు. ప్ర‌ధాన పోటీ టీఆర్ెస్, బిజెపీ ల మ‌ద్య జ‌రుగుతుంది.

– 12వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 2520 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. టీఆర్ఎస్ 36745, బీజేపీ 39265, కాంగ్రెస్ 10662, నోటా 336 ఓట్లు పోలయ్యాయి

– 13వ రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ 3726 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి బీజేపీ 39265, టీఆర్ఎస్ 35539, కాంగ్రెస్ 11874.

– 14వ రౌండ్ : బీజేపీ 41514, టీఆర్ఎస్ 38076, కాంగ్రెస్ 12658. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 3438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

– 15వ రౌండ్ : బీజేపీ 43586, టీఆర్ఎస్ 41103, కాంగ్రెస్ 14158. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 2483 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ పుంజుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. బిజేపీ ఆధిక్యాన్ని తగ్గించింది.

– 16వ రౌండ్‌లో దూకుడు పెంచిన టీఆర్ెస్ పార్టీ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి 44260 ఓట్ల‌తో ఉంది. బిజేపీకి 45994 ఓట్లు, కాంగ్రెస్ 14832 ఓట్లు వ‌చ్చాయి. బిజేపీ ఆధిక్యం 1734కి త‌గ్గింది.

– 17వ రౌండ్‌ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి 47078ఓట్లు, బిజేపీకి 47940 ఓట్లు, కాంగ్రెస్ 16537 ఓట్లు వ‌చ్చాయి. బిజేపీ ఆధిక్యం 862కి త‌గ్గింది.

– 17వ రౌండ్‌ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి టీఆర్ఎస్ 47078 ఓట్లు, బిజేపీకి 47940 ఓట్లు, కాంగ్రెస్ 16537 ఓట్లు వ‌చ్చాయి. బిజేపీ ఆధిక్యం 862కి త‌గ్గింది.

– 18వ రౌండ్ : బీజేపీ 50467, టీఆర్ఎస్ 50293, కాంగ్రెస్ 17389. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 174 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

– 19వ‌ రౌండ్ ముగిసే స‌మ‌యానికి టీఆర్ఎస్ లీడ్‌లోకి వ‌చ్చేసింది. ఇంత‌కు మందువర‌కు ఆధిక్యంలో ఉన్న బీజేపీ పార్టీ రెండోస్థానానికి చేరింది. టీఆర్ఎస్ కి 53053  ఓట్లు, బిజేపీకి 52802ఓట్లు, కాంగ్రెస్ కి 18365 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్  అభ్య‌ర్థి సోలిపేట సుజాత 251 ఓట్ల‌తో ముందంజ‌లో ఉంది.

– 20వ రౌండ్‌లో బీజేపీకి పుంజుకుంది 240 ఓట్ల ఆధిక్యంతో ముందంజ‌లో ఉండ‌గా, టీఆర్ఎస్ కి 55493 ఓట్లు, బిజేపీకి 55733 ఓట్లు, కాంగ్రెస్ కి 19423ఓట్లు.

– 21వ రౌండ్ బీజేపీ 620 ఓట్ల ఆధిక్యం పొందింది. టీఆర్ఎస్ కి 57541 ఓట్లు, బిజేపీకి 58161 ఓట్లు, కాంగ్రెస్ కి 20268 ఓట్లు.

– 22వ రౌండ్  : బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1058 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.. టీఆర్ఎస్ కి 60061 ఓట్లు, బిజేపీకి 61119 ఓట్లు, కాంగ్రెస్ కి 21239 ఓట్లు వ‌చ్చాయి.

-23వ రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి బీజేపీ 62772, టీఆర్ఎస్ 61302, కాంగ్రెస్ 21819. బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలుపు.

Read more RELATED
Recommended to you

Latest news