రెండోరోజు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని విచారిస్తున్న ఈడి

-

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడి నోటీసులతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మంచిరెడ్డిమంచి రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకోగా మంగళవారం ఆయనను 9 గంటల పాటు విచారించారు. నేడు మరోసారి మంచిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు.

హైదరాబాదులోని ఈడీ కార్యాలయానికి రెండో రోజు ఆయన హాజరయ్యారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఆస్ట్రేలియా, సింగపూర్​లకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై… మంచిరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. ఆయన బ్యాంకు ఖాతాలు పరిశీలించిన అధికారులు కొన్ని లావాదేవీలపై ఆరా తీశారు. దిల్లీ మద్యం కేసులో రాష్ట్రంలో పలుచోట్ల వరుసపెట్టి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పిలిపించి ప్రశ్నిస్తుండటం ప్రాధాన్యం సతరించుకుంది.

ఈ విషయంపై మాట్లాడేందుకు ఈడీ అధికారులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు కాలేదని, ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే ఆయనను మౌఖికంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇందులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా అవసరమైతే ఈడీ అదికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news