గాంధీ ఆస్పత్రి ముందు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్

-

గాంధీ ఆస్పత్రి ముందు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. గాంధీ ఆస్పత్రి ముందు గాంధీ విగ్రహ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరీశీలించారు మంత్రులు హరీష్ రావు, తలసాని. అక్టోబర్ 2న గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్..ఆవిష్కరించనున్నట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చేనేత కార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.

కిషన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తేలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరుపున చేనేత రంగం కార్మికులకు ఏం చేసింది? అని ప్రశ్నించారు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలన్నారు. చేనేత రంగం మీద ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం హామీ ఇచ్చారని.. నల్లగొండ జిల్లా బోధన్ పోచం పల్లి , సిరిసిల్ల ల్లో అనాడు ఆత్మ హత్యలకు పాల్పడిన కుటుంబాలకు యాబై లక్షలు అందించామన్నారు. చేనేత రంగం కార్మికులకు ప్రభుత్వం తరుపున అనేక రకాల చేయూతను ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. 350కోట్ల రూపాయల నిధులతో బతుకమ్మ చీరలకు ఆర్డర్ ను చేనేత కార్మికులకు ఇచ్చామన్నారు మంత్రి హరీష్ రావు.నేతన్నలు భీమా, మరమగ్గాల కు సబ్సిడి లాంటి అవకాశాలు ఇస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news