ఇకనైనా భూమిమీద నడువు.. కేసీఆర్‌ కు ఈటల వార్నింగ్‌

ఇకనైనా భూమిమీద నడువు.. కేసీఆర్‌ కు ఈటల రాజేందర్ వార్నింగ్‌ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఎన్నో హామీలు ప్రొసీడింగ్స్ ఇచ్చారని.. హుజురాబాద్ ఎన్నికలు దళితుల మీద ప్రేమ వారి అభివృద్ధి కోసమే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చేశారని నిప్పులు చెరిగారు.

సీఎం కెసిఆర్ కి దళితుల ఓట్లు తప్ప వారిమీద ప్రేమతో కాదని.. ఈ రోజు దుఃఖం లేనోడు బర్లను కొన్నాడు.. దళితులకు బర్లను అప్పచెప్పాడని ఆగ్రహించారు. ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదే కాదని.. ఈటల రాజేందర్ రాజీనామాతోటే కెసిఆర్ దిగివచ్చి ఇన్ని హామీలు ఇచ్చాడన్నారు. 2023 వరకు దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పరిస్థితి లేదని.. 10 లక్షల స్కీమ్ లో దళితులకు పూర్తి స్వేచ్చ ఇవ్వాలని కోరారు.

దళిత బంధు డబ్బులు ప్రగతి భవన్ నుండి ఇస్తలేవని.. కెసిఆర్ ఊరురా బెల్టు షాపులు పెట్టి ఎన్నో కుటుంబాల బతుకులు రోడ్డు మీద పడేస్తున్నాడని మండిపడ్డారు. ఎలక్షన్ అయినా తెల్లవారి నుండి నియోజకవర్గం లో ఒక్క నాయకుడు కనిపిస్తలేడని.. కెసిఆర్ మీద ప్రజలకు వ్యతిరేకత మొదలయిందన్నారు.