Free Current: 200యూనిట్ల కరెంట్ ఫ్రీ అమలుకు అధికారులు సంసిద్ధం అయ్యారు.. బిల్లింగ్ సమయంలోనే వినియోగదారుల ఆధార్, రేషన్, ఫోన్ నంబర్లను సిబ్బంది నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఇంటి వద్ద ఎవరూ లేకపోయినా పేపర్‌పై వివరాలు రాసి మీటర్లపై అంటిస్తే తమకు సులువు అవుతుందని సిబ్బంది కోరుతున్నారు.
ఈ పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) తెలిపింది. అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా డిస్కం ఈ వివరణ ఇచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇటీవల చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో ఈ పథకానికి 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.